News August 24, 2024

అచ్యుతాపురం: ఎసెన్షియా కంపెనీ తాత్కాలికంగా మూసివేత

image

అచ్యుతాపురం సెజ్‌లోని ప్రమాదం జరిగిన ఎసెన్షియా కంపెనీని యాజమాన్యం తాత్కాలికంగా మూసివేసింది. లోపల ప్రమాదంలో దెబ్బతిన్న భవనాల పునర్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి శకలాలను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. దీనిని 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు. రూ.200 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ మైగ్రేన్, క్యాన్సర్ నివారణ మందులు తయారవుతాయి. 400 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.

Similar News

News January 21, 2025

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్

image

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం  ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం మీద 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్, అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీశ్‌ను నియమించింది. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేయడం గమనార్హం.

News January 21, 2025

జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌కు బదిలీ

image

జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను సీడీఎంఏకు బదిలీ చేశారు. 2024 సెప్టెంబర్‌లో జీవీఎంసీ కమిషనర్‌గా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఛార్జ్ తీసుకున్న కేవలం ఐదు నెలలలోపే ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈయన స్థానంలో ఇంకా ఎవరినీ కేటాయించలేదు. 

News January 20, 2025

పాడేరు ఘాట్‌లో తప్పిన పెను ప్రమాదం

image

పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాడేరు నుంచి విశాఖకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఏసుప్రభు విగ్రహం మలుపు వద్ద రైలింగ్ ఢీ కొట్టి నిలిచిపోయింది. రైలింగ్ లేకపోతే పెద్ద లోయలో బస్సు పడేదని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కొంతసేపు బస్సు నిలిచింది. మలుపులో స్టీరింగ్ పట్టేయడంతో నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టింది.