News April 7, 2025

అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవండి: వరంగల్ సీపీ

image

మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్  పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిబ్రవరి 21న వరంగల్ సీపీ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డ్‌ను అందజేశారు. పోలీస్ అధికారులు ఉన్నారు.

Similar News

News April 8, 2025

డుంబ్రిగూడ: డిప్యూటీ సీఎంకు ఉపాధి సిబ్బంది వినతి

image

డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో మంగళవారం పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అల్లూరి జిల్లా ఉపాధి సిబ్బంది తమ బాధలను ఏకరువు పెట్టారు. చాలీచాలని జీతాలతో గత 20ఏళ్ళు పైబడి పని చేస్తున్నామని, పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా ఇబ్బందిగా మొర పెట్టుకున్నారు. పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర అలవెన్సులు మంజూరు చేయాలని కోరారు.

News April 8, 2025

ఇల్లు కట్టుకునే వారికి బ్యాడ్ న్యూస్

image

ఏప్రిల్‌లో సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ తెలిపింది. ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా మూడు నెలలు పెరుగుతూ వచ్చిన సిమెంట్ ధరలు మార్చిలో తగ్గాయి. ఈనెల సౌత్ రీజియన్‌లో బస్తాకు రూ.30 చొప్పున పెరిగే అవకాశముందని పేర్కొంది.

News April 8, 2025

ఏలూరు: ఇద్దరు దొంగలు అరెస్ట్

image

ఏలూరు 3వ పట్టణం పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన గాల్సిద్ (29), రాజశేఖర్ (27) మిత్రులన్నారు. చెడు అలవాట్లకు బానిసై పార్క్ చేసిన స్కూటీ డిక్కీ లోని నగదును కాజేసేవారని, ఇదే స్టైల్‌లో ఏలూరులో రెండు దొంగతనాలు జరగగా అరెస్టు చేసి రూ.5 లక్షలు రికవరీ చేశామన్నారు.

error: Content is protected !!