News April 3, 2025
అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.
Similar News
News April 5, 2025
HYDలో దర్శనానికి సాయిబాబా నాణేలు

లక్ష్మీ భాయి షిండేకు షిర్డీ సాయిబాబా స్వయంగా అందించిన దైవికమైన 9 సాయి నాణేలు చాదర్‌ఘాట్ సాయిబాబా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న ఉ.11 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ నాణేలు ప్రదర్శించనున్నట్లు సాయిబాబా ఆలయ అధికారులు తెలిపారు. ఈ అరుదైన పుణ్యదర్శనాన్ని భక్తులు తప్పక వినియోగించుకోవలసిందిగా వారు కోరారు.
News April 5, 2025
HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.
News April 4, 2025
HYD ప్రెస్‌క్లబ్ 2025 డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 2025 డైరీని తన క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం ఆవిష్కరించారు. ప్రెస్‌క్లబ్‌కు స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రిని ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, రవికాంత్ రెడ్డి కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. అనంతరం ప్రెస్‌క్లబ్ పాలకమండలి సభ్యులు బట్టిని శాలువాతో సత్కరించారు.