News April 3, 2025

అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

image

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

Similar News

News April 5, 2025

శుభ ముహూర్తం (05-04-2025)

image

☛ తిథి: శుక్ల అష్టమి రా.12.31 వరకు
☛ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.13 వరకు
☛ శుభ సమయం: ఆరుద్ర శివ పూజలకు మంచిది
☛ రాహుకాలం: ఉ.9.00-మ.10.30 వరకు
☛ యమగండం: మ.1.30-మ.3.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36 వరకు
☛ వర్జ్యం: రా.10.11-11.44 గంటల వరకు
☛ అమృత ఘడియలు: అమృతం లేదు

News April 5, 2025

‘చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు’

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అనంతపురం డివిజన్‌కు సంబంధించి జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ, డీఎల్సీ/డీఎల్ఎన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ (చుక్కల భూములు) సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతివారం షెడ్యూల్ చేసుకుని జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.

News April 5, 2025

దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం: మంత్రి ఉత్తమ్

image

ఆహార భద్రత విషయంలో దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సన్న బియ్యం లబ్ధిదారులు పాలడుగు వెంకటయ్య నివాసాన్ని సందర్శించి వారితో కలిసి భోజనం చేసి మాట్లాడారు. సన్నబియ్యం పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలందరికీ మేలు జరుగుతుందని, గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.

error: Content is protected !!