News March 18, 2025

అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

image

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.

Similar News

News March 19, 2025

MBNR: TG ఖోఖో జట్టులో ఎంపికైన పీడి

image

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టులో మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల(ZPHS)కు చెందిన పీడీ ఎం. వెంకటమ్మ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన వెంకటమ్మను జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు. >CONGRATULATIONS

News March 19, 2025

జగిత్యాల: కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు బుధవారం ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. ఇతర ఉద్యోగుల మాదిరిగా సెలవులు కేటాయించాలన్నారు. వీరికి సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

News March 19, 2025

GATE ఫలితాలు విడుదల

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులు gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!