News April 2, 2025

అద్దంకిలో ప్రజా సమస్యలపై మంత్రి గొట్టిపాటి ఆరా

image

అద్దంకి పట్టణంలోని భవాని కూడలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన అనంతరం కనిగిరి వెళ్లి తిరిగి వెళ్తూ భవాని సెంటర్లో ఆగారు. అక్కడ ప్రజలతో మాటలు కలిపి సమస్యలపై ఆరా తీశారు. సీఐ సుబ్బరాజు మంత్రి భద్రతను పర్యవేక్షించారు.

Similar News

News April 3, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, HYD, VKB, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కర్నూలు, కడప, చిత్తూరు సహా మరికొన్ని జిల్లాల్లో పడిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు, ఎల్లుండి కూడా <<15974523>>వర్షాలు <<>>కురుస్తాయన్న హెచ్చరికలతో స్కూళ్లకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని, సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా? కామెంట్ చేయండి.

News April 3, 2025

కంచ భూముల వివాదంపై కమిటీ ఏర్పాటు

image

TG: గచ్చిబౌలి కంచ భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ కమిటీలో చోటు కల్పించింది. HCU, విద్యార్థులు, ప్రజాసంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. కాగా భూముల్లో జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

News April 3, 2025

ATP: పాఠశాలల పునఃవ్యవస్థీకరణ పూర్తి కావాలి- కలెక్టర్

image

ప్రభుత్వం 117 జీఓను ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో మండల విద్యాశాఖ అధికారులతో పాఠశాలలు పునఃవ్యవస్థీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు.

error: Content is protected !!