News April 1, 2025

అధికారులకు NTR కలెక్టర్ ఆదేశాలు

image

ఏప్రిల్ 1న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,28,813 మందికి రూ. 98.11 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ జరపాలని సూచించారు.

Similar News

News December 30, 2025

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?

image

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే కోల్డ్ చేస్తుందని అనుకుంటారు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ నేచురల్ హైడ్రేట్స్‌గా పనిచేస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. స్కిన్‌ను పొడిబారకుండా కాపాడుతాయి. పొటాషియం బీపీని నియంత్రించడమే కాకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్కౌట్ తర్వాత/మధ్యాహ్నానికి ముందు తాగితే మంచిది. ఇవి సేఫ్, స్మార్ట్ & రిఫ్రెషింగ్ ఛాయిస్ కూడా.

News December 30, 2025

నాగర్‌కర్నూల్‌: ఇంటర్‌ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరిగే పరీక్షల కోసం జిల్లాలో 34 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News December 30, 2025

ఖమ్మం: రూ.2.5 లక్షలతో జర్మనీలో ఉద్యోగావకాశాలు

image

‘టామ్‌కామ్’ ఆధ్వర్యంలో నర్సులకు ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ ఇచ్చి, జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. బీఎస్సీ లేదా జీఎన్ఎమ్ పూర్తి చేసి, ఏడాది క్లినికల్ అనుభవం ఉన్న 22-38 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం నెలకు రూ.2.5 నుంచి 3 లక్షల వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.