News March 23, 2025
అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

తుళ్లూరు మండలం వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో మార్చి 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది ఉత్సవాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేదిక ఏర్పాట్లను శనివారం సాయంత్రం సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 26, 2025
మంగళగిరి రైల్వే వంతెనకు కేంద్రం ఆమోదం

మంగళగిరి నగరంలోని నిడమర్రు రైల్వే వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేశ్‌ల వినతుల మేరకు మంగళవారం ఎల్సీ 14వద్ద ఆర్వోబీనీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సుమారు రూ.129.18 కోట్ల అంచనా వ్యయంతో.. కిలోమీటరు మేర 4 వరుసల రైల్వే వంతెన నిర్మాణం కానుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే అటు రాజధానితో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉపయోగకరంగా ఉంటుంది.
News March 25, 2025
తుళ్లూరు: జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు

పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే. హర్షవర్ధన్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో ఎంజీ రోడ్డులో ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు నిర్ణయించారు.
News March 25, 2025
భూసమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి: మంత్రి అనగాని

భూసమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. వెలగపూడిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ భూములు 22ఏలో ఉండకూడదన్నారు. పేదలకు న్యాయం చేయాలన్నదే సీఎం చంద్రబాబు తపన అని, 22ఏ, ఫ్రీహోల్డ్ భూములపై ప్రత్యేక డ్రైవ్- భూవివాదాలు పరిష్కారంపై కలెక్టర్లు శ్రద్ధ చూపాలని సూచించారు.