News March 20, 2025

అధికారులకు సూచనలు చేసిన మేయర్, కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ఎజెండాపై మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ఎజెండాపై అధికారులకు వారు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.

Similar News

News March 20, 2025

యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్

image

బెట్టింగ్ ఊబిలో పడి అప్పు మీద అప్పు చేసి, తీర్చేందుకు స్తోమత లేక.. చివరికి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం గోర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర(28) గుత్తి రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మహేంద్ర గతంలో వాలంటీర్‌గా పనిచేసి, ప్రస్తుతం పెన్నా సిమెంట్‌లో పనిచేస్తున్నాడు.

News March 20, 2025

BREAKING: మరో భారీ ఎన్‌కౌంటర్

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో పలువురు మావోలు మరణించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.

News March 20, 2025

అలా చేయడం రేప్ కాదు: అలహాబాద్ హైకోర్టు

image

వక్షోజాలను తాకడం, పైజామాను తీసివేయాలని ప్రయత్నించడం రేప్ కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 11 ఏళ్ల చిన్నారితో ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఇలా పేర్కొంది. అయితే ఈ కేసులో బాధితురాలిని దుస్తులు లేకుండా చేయలేదని సాక్షులు పేర్కొన్నట్లు తెలిపింది. అంతేకాకుండా లైంగిక దాడికి యత్నించారనే ఆరోపణలు కూడా లేవంది. కింది కోర్టు రేప్ కేసుగా పేర్కొనగా HC దానిని సవరించింది.

error: Content is protected !!