News April 7, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అదనపు కలెక్టర్

image

వేసవి కాలం దృష్ట్యా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి సూచించారు. వేసవి కాలంలో సంబంధిత శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేసవికాలంలో వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News April 8, 2025

ఆదిలాబాద్‌: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని KRK కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. భాగ్యలక్ష్మి, గంగన్న అనే ఇద్దరు.. అమాయక మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించామన్నారు. నిందితులైన భాగ్యలక్ష్మి, గంగన్నతో పాటు విటులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 8, 2025

సిరిసిల జిల్లాలో విషాదం.. తల్లీకొడుకు మృతి

image

తల్లీకొడుకు మృతితో రుద్రంగిలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆదివారం పుష్పలత(35) చనిపోగా.. సోమవారం కొడుకు నిహాల్ తేజ్(6) మృతిచెందాడు. దీంతో మృతురాలి బంధువులు అత్తింటిపై దాడి చేశారు. తమ కూతురు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోలేదన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు హామీతో శాంతించారు. శుక్రవారం రాత్రి చపాతి తిన్న ఇరువురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

News April 8, 2025

జి. కొండూరులో గోడ కూలి ఒకరి మృతి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జి. కొండూరు (M) పినపాకలో సోమవారం దారుణం జరిగింది. మంగారావు (46) ఇబ్రహీంపట్నం బస్సు డిపో కండక్టర్‌గా పని చేస్తున్నారు. సాయంత్రం వాకింగ్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీగా ఈదురు గాలులతో వర్షం పడింది. దీంతో ఆయన గోడ పక్కకు వెళ్లగా గోడ కూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మైలవంరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

error: Content is protected !!