News February 8, 2025

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జరగనున్న మహా కుంభాభిషేకం చివరి రోజు మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

Similar News

News February 9, 2025

CCL: తెలుగు వారియర్స్ ఓటమి

image

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో మ్యాచులో తెలుగు వారియర్స్ 46 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 113/3 స్కోర్ చేయగా, తెలుగు టీమ్ 99/5 చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బుల్డోజర్స్ 123/3 స్కోర్ సాధించగా, వారియర్స్ 91/9కే పరిమితమై పరాజయం పాలైంది. KA జట్టులో డార్లింగ్ కృష్ణ 38 బంతుల్లోనే 80 రన్స్ చేసి రాణించారు.

News February 9, 2025

అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్: డిపో మేనేజర్‌ 

image

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్‌ నడుపుతున్నట్లు RTC WGL-1 డిపో మేనేజర్‌ వంగల మోహన్‌ రావు తెలిపారు. ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ నుంచి బయలు దేరుతుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.4500, పిల్లలకు రూ.3వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 9959226047, 9494107944 నెంబర్‌లో సంప్రదించాన్నారు.

News February 9, 2025

ఫిబ్రవరి 9: చరిత్రలో ఈరోజు

image

1966: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ జననం
1969: బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు
1975: సినీ నటుడు సుమంత్ జననం
2008: సంఘ సేవకుడు, పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత మురళీధర్ దేవదాస్ ఆమ్టే మరణం
2021: సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం (ఫొటోలో)

error: Content is protected !!