News November 20, 2024
అధికారులు సాంకేతికను ఉపయోగించుకోవాలి: JC
తణుకు మండలం దువ్వ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సేవ కేంద్రంలో రైతులతో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో నిర్వహణ డేటా ఎంట్రీలను నిశితంగా ఆయన పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులకు సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 27, 2024
ఏలూరు జిల్లాలో రూ. 92.02 కోట్లు మంజూరు: కలెక్టర్
ఏలూరు జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.92.02 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల్లో రహదారుల సమస్య లేకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రోడ్డు నిర్మాణాలు చేపట్టిందని, సంక్రాంతికి మంజూరు చేసిన సీసీ రోడ్డులు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
News December 26, 2024
తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి
తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరు గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి జాన్సీరాణి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది.
News December 26, 2024
ప.గో: దిశ మార్చుకున్న అల్పపీడనం..వర్షాలు ఎక్కడంటే
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుందని విశాఖ వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. గురువారానికి వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య, తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో బలహీనపడుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు.