News April 4, 2025
అధ్యక్ష పదవికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే నామినేషన్

విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిల్మ్ నగర్ క్లబ్ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 38 నామినేషన్లు వేసినట్లు సమాచారం. కాగా.. అధ్యక్ష పదవికి విష్ణుకుమార్ రాజుతో పాటు సినీ నిర్మాత కేఎస్ రామారావు కూడా పోటీలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పరశురామ రాజు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడింది: విశాఖ ఎంపీ

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విశాఖలో 33 ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, రుషికొండ ప్యాలెస్‌కు రూ.450కోట్లు YCPప్రభుత్వం ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ, విశాఖలో TCSకు ప్రతిపాదనలు చేశామన్నారు.
News April 18, 2025
ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్థాగత ఎన్నికలు: ఎంపీ శ్రీభరత్

T.D.P. సంస్థాగత ఎన్నికల్లో అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలను ఎన్నుకోవాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సూచించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాభిప్రాయం కుదరకపోతే జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
News April 18, 2025
రుషికొండలో తిరుమల విక్రయాలు పునఃప్రారంభం

రుషికొండ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ విక్రయాలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇటీవల ఒంటిమిట్ట సీతారామ కల్యాణోత్సవం కోసం లడ్డూలు తరలించడంతో అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు భక్తులకోసం ఆలయంలోనే కౌంటర్ ద్వారా లడ్డూల విక్రయాలు ఏప్రిల్ 19వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభమవుతాయని ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు శుక్రవారం తెలిపారు.