News April 12, 2025
అనంత: 477 మంది లబ్ధిదారులకు మెగా చెక్ పంపిణీ

2024-25 ఆర్థిక సంవత్సరంలో అనంతపురం జిల్లాలో స్వయం ఉపాధి పథకానికి 477 మంది లబ్ధిదారులు ఎంపిక అయినట్లు జిల్లా కలెక్టర్ వినోద్ శుక్రవారం తెలిపారు. 477 మందికి రూ.11.61 కోట్ల మెగా చెక్కును ఎంపీ అంబికా నారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అందజేశారు. స్వయం ఉపాధి పథకానికి సంబంధించి మండలాల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, చెక్కులు అందించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు.
Similar News
News April 19, 2025
ATP: తాడిపత్రి ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తా – ఎంపీ

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఉపకరణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు వై నారాయణరెడ్డి, మల్లికార్జున రెడ్డి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను శనివారం కలిశారు. అనంతపురంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ రూ. కోటి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
News April 19, 2025
అనంతపురం జిల్లాలో 72 అటెండర్ పోస్టులు

అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 72 అటెండర్ పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం చేశామని DMHO దేవి తెలిపారు. ఇందులో MRI, MRN, OT టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, నెట్ అడ్మినిస్ట్రేటర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, పెర్ ప్యూజినిష్ట్, అటెండర్ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నవంబర్‌లో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.
News April 19, 2025
అనంత: స్వర్ణాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష

అనంతపురంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం అన్ని శాఖలతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ ఆంధ్రా- స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ జరిగిందన్నారు. గ్రామస్థాయిలో పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.