News March 23, 2024
అనంత: అత్యాచారం కేసులో నిందుతుడికి పదేళ్ల జైలు

గార్లదిన్నెలో కూరగాయల మండీలో కూలీగా అస్సాం రాష్ట్రానికి చెందిన పప్పుబాగ్ (రాజు) పని చేసేవాడు. ఈక్రమంలో 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. 4నెలల గర్భవతిగా ఉండగా 2023 మే 26న బాలిక తల్లిదండ్రులు గార్లదిన్నె పోలీసుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో పదేళ్లు జైలు, రూ.3 వేలు పొక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించింది
Similar News
News April 24, 2025
స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.
News April 24, 2025
ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.
News April 23, 2025
కూలీ కుమారుడికి 593 మార్కులు

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.