News February 25, 2025
అనంత జిల్లా వ్యాప్తంగా 59 ఫిర్యాదులు

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 59 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలనే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 25, 2025
ఐదుగురికి జీవిత ఖైదు.. ఆ వీడియోనే సాక్ష్యం!

శింగనమల నియోజకవర్గం నార్పలలో మట్టి పవన్ అనే యువకుడి <<15562592>>హత్య<<>> కేసులో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష పడిన విషయం తెలిసిందే. 2020లో పవన్‌ను స్టీల్ రాడ్డు, కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేశారు. ముద్దాయిల్లో ఒకరైన సుధాకర్ దాడి దృశ్యాలను చిత్రీకరించాలని స్నేహితులకు సూచించారు. ‘ఈ వీడియో చూసినవారు మనమంటే భయపడాలి. సుధాకర్ అంటే ఒక బ్రాండ్’ అంటూ చితకబాదారు. ఇప్పుడు ఆ వీడియో ఫుటేజీ సాక్ష్యంగానే జడ్జి తీర్పు చెప్పారు.
News February 25, 2025
వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ

విజయవాడలోని స్పా సెంటర్లో పోలీసులకు దొరికిన వైసీపీ నేత వడిత్యా శంకర్ నాయక్‌ను పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.
News February 24, 2025
అనంతపురం జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

☞ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
☞ అనంత జిల్లాలో 48,690 మంది <<15560376>>ఇంటర్ విద్యార్థులు<<>>
☞ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం- ఎంపీ
☞ అనంతపురం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరించిన జేసీ
☞ రాప్తాడులో చెరువులను నీటితో నింపండి – ఎమ్మెల్యే
☞ గుత్తిలో క్రషర్ మిషన్‌లో పడి <<15564856>>యువకుడి మృతి<<>>
☞ అనంతపురంలో హత్య.. ఐదుగురికి <<15562592>>జీవిత ఖైదు<<>>