News April 12, 2025
అనంత జిల్లాకు 13వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో అనంత జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 19,541 మంది పరీక్షలు రాయగా 15,632 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో అనంత జిల్లా రాష్ట్రంలోనే 13వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 22,824 మందికి 14,439 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 17వ స్థానంలో జిల్లా నిలిచింది.
Similar News
News April 13, 2025
పామిడి అమ్మాయికి 984 మార్కులు

ఇంటర్ ఫలితాల్లో పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సత్తా చాటారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన యువతి బైపీసీ విభాగంలో 1000కి 984 మార్కులు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు వచ్చాయని గీతాంజలి తెలిపారు. అధ్యాపకులు, స్నేహితులు, బంధు మిత్రులు అభినందించారు.

ఇంటర్ ఫలితాల్లో తేజ కళాశాల విద్యార్థుల ప్రతిభ

అనంతపురంలోని తేజ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని డైరెక్టర్ తేజరెడ్డి, ఛైర్పర్సన్ ఉమాదేవి తెలిపారు. సీనియర్ ఇంటర్లో అత్యధికంగా 991 మార్కులు, జూనియర్ ఇంటర్లో ఎంపీసీ 465, బైపీసీ 435 మార్కులతోపాటు మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఫలితాలపై కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.