News June 22, 2024
అనంత జిల్లాలో పది రోజుల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం
జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు 10 రోజుల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు పంపారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేర్చారు. ఈనెల 24నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రహదారులకు ఇరువైపులా 100 కి.మీలలో ప్లాంటేషన్ చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News January 3, 2025
రాష్ట్రస్థాయిలో ధర్మవరం బాలికలకు ద్వితీయ స్థానం
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇంటర్, స్కూల్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ధర్మవరం బాలికల జట్టు రాణించి రన్నర్స్‌గా (ద్వితీయ స్థానం) నిలించింది. ఈ మేరకు అనంతపురం ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి గురువారం తెలిపారు. గత నెల 28, 29, 30వ తేదీలలో చిత్తూరులో జరిగిన టోర్నమెంట్లో ధర్మవరం జట్టుపై బంగారుపాలెం జట్టు 2 పాయింట్లతో గెలిచి మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు.
News January 3, 2025
శ్రీ సత్యసాయి: పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో ఎనుము పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News January 3, 2025
పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించండి: కలెక్టర్
దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ తెలిపారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.