News March 23, 2024
అనంత: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
వజ్రకరూరు మండలం కమలపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కమలపాడుకు చెందిన రవితేజ, అజయ్, నరేష్ కొనకొండ్ల జడ్పీ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాశారు. బైక్‌లో ముగ్గురు కమలపాడుకు బయలుదేరారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు.
Similar News
News January 23, 2025
అనంతపురం జిల్లా నిరుద్యోగ మహిళలకు శుభవార్త
రూట్ సెట్ సంస్థలో ఈ నెల 25 నుంచి 30 రోజుల పాటు కంప్యూటర్ ట్యాలీలో ఉచితశిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం జిల్లాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18-45 ఏళ్ల వారు ఆధార్, రేషన్ కార్డుతో రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు.
News January 23, 2025
పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని 32 మండలాల్లో మండలానికి ఒక వైద్య శిబిరరం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News January 22, 2025
హలో అనంతపూర్.. వచ్చేస్తున్నాం: బాబీ
అనంతపురంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ జరగనుది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తరలివస్తోంది. ఈ క్రమంలో హలో అనంతపూర్.. అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. ‘డాకు మహారాజ్ విజయోత్సవ పండుగకి వచ్చేస్తున్నాం. ఈ సాయంత్రం అంతా కలుద్దాం’ అని పోస్ట్ పెట్టారు. ఆయనతో పాటు బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, తమన్, నిర్మాత నాగ వంశీ, సినీ ప్రముఖులు రానున్నారు.