News March 2, 2025
అనంత: విషాదం.. తల్లితో పాటు 3 నెలల కుమార్తె మృతి

కూడేరు మండలం కమ్మూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తె మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న సరస్వతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కుమార్తె 3 నెలల చిన్నారి మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News March 3, 2025
ప్రజల నుంచి 330 ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి 330 ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు.
News March 3, 2025
రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం చేనేతకు ఆహ్వానం

ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్ నాగరాజుకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Vividtha Ka Amrit Mahotsav కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి భవన్లో ధర్మవరం పట్టు చీరల ప్రదర్శన కోసం నాగరాజు ఆహ్వానం అందుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.
News March 3, 2025
విషాద ఘటనపై మంత్రి పయ్యావుల దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తన మనసును కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. కాగా ఈ విషాద ఘటనలో ముగ్గరు అక్కాచెల్లెళ్లు, మూడు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే.