News February 22, 2025

అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

image

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 17, 2025

చేతిలో డబ్బు నిలవాలంటే..

image

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.

News December 17, 2025

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>CSIR<<>>-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cdri.res.in

News December 17, 2025

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో కృష్ణా జిల్లాకే అగ్రస్థానం.!

image

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం దక్కించుకుంది. మంగళవారం వరకు జిల్లాలో 3,83,127 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు తెలిపారు. 49,132 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటికే 47,182 మంది రైతులకు రూ. 864.72 కోట్లు జమ చేశారు. మిగిలిన రైతులకు త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు వివరించారు.