News October 30, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయని చెప్పారు. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 33-34.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావచ్చని తెలిపారు. ఇక గాలులు గంటకు 2 కి.మీ వేగంతో వీచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

Similar News

News October 30, 2024

తుంగభద్ర జలాశయానికి తగ్గిన ఇన్ ఫ్లో

image

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గిందని డ్యామ్ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 13,893 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోందన్నారు. ప్రస్తుతం 101.773 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. 15,054 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

News October 30, 2024

గుత్తి రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ 

image

గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి షేక్ మహమ్మద్ వలికి సైబర్ నేరగాళ్లు రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. నాలుగు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని మహమ్మద్ వలికి కాల్ చేశారు. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందని బెదిరించారు. వెంటనే అరెస్టు చేయకూడదంటే మీ వద్ద ఉన్న డబ్బంతా తమ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు. దీంతో బాధితుడు భయపడి డబ్బు బదిలీ చేశాడు.

News October 30, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.28

image

అనంతపురం రూరల్‌ స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.28తో అమ్ముడు పోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 975 టన్నుల దిగుబడులు వచ్చాయని ఆయన అన్నారు. కిలో సరాసరి ధర రూ.20, కనిష్ఠ ధర రూ.13 పలికినట్లు తెలిపారు. మార్కెట్లో టమాటా ధరలు క్రమేణా తగ్గుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.