News December 27, 2024

అనంతపురం జిల్లాలో 2,53,489 మందికి పింఛన్

image

అనంతపురం జిల్లాలో ఈ నెల 31న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. లబ్ధిదారులు అందరూ ప్రతినెలలాగే ఇంటి వద్దే పింఛన్ సొమ్ము పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో 2,53,489 మందికి మొదటి రోజే పంపిణీ చేస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యతో ఆగితే జనవరి 2న ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేస్తారని వెల్లడించారు.

Similar News

News February 5, 2025

నేడు అనంతపురంలో హార్టికల్చర్‌ కాంక్లేవ్‌

image

అనంతపురంలోని MYR ఫంక్షన్ హాలులో ఇవాళ ఉదయం 9 గంటలకు హార్టికల్చర్‌ కాంక్లేవ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కాంక్లేవ్‌ సమావేశంలో హార్టికల్చర్‌ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్‌లతో పాటు 16 మంది దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్‌ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాతో 6 MOUలు కురుర్చుకోనున్నారు.

News February 5, 2025

అనంతపురంలో నేత్ర స్వీకరణ కేంద్రం ప్రారంభం

image

అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీవై కుళ్లాయప్ప నేత్ర స్వీకరణ కేంద్రం ప్రారంభమైంది. కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్ క్రాస్ శరవేగంగా దూసుకుపోతోందని, ఇప్పటికే మెంబర్షిప్, సీఎస్ఆర్ కార్యక్రమంలో రాష్ట్రంలోనే ముందు ఉన్నామని తెలిపారు. కంటి దాన అంగీకార పత్రాల సేకరణలోనూ మన రెడ్ క్రాస్ ముందుండాలన్నారు.

News February 4, 2025

కిలో టమాటా రూ.14, టన్ను చీనీ రూ.19వేలు

image

అనంతపురంలో టమాటా ధరలు రైతులకు నిరాశే మిగిలిస్తున్నాయి. కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో టమాటా రూ.14 పలికింది. సరాసరి ధర రూ.11, కనిష్ఠ ధర రూ.7తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు కూడా భారీగా పడిపోయాయి. నిన్న టన్ను గరిష్ఠంగా కేవలం రూ.19వేలతో అమ్ముడయ్యాయి. కనిష్ఠంగా రూ.8వేలు పలికాయి.

error: Content is protected !!