News April 5, 2025

అనంతపురం జిల్లాలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

image

అనంతపురం జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్టోగ్రతలు గరిష్ఠంగా 36.5 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా కొనసాగుతుందన్నారు. దీంతో గాలివేగం స్వల్పంగా పెరగడం వల్ల ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 12 కిలోమీటర్లు వీస్తాయని, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Similar News

News April 6, 2025

గుత్తి: యువకుడిపై దూసుకెళ్లిన ట్రాక్టర్

image

గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో పండగ రోజు ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెద్దొడ్డి గ్రామానికి చెందిన విజయ్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడటంతో మృతి చెందాడు. రాళ్లు తీసుకురావడానికి కూలీలతో కలిసి వెళ్లాడు. రాళ్లు వేస్తున్న సమయంలో కింద నిలుచొని ఉన్న విజయ్‌పై ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే  మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 6, 2025

నంచర్ల- గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

image

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్‌వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

News April 6, 2025

వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన ఖరారు

image

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించనున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.

error: Content is protected !!