News September 14, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.30
★ అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో శుక్రవారం కిలో టమాటా రూ.30 పలికింది. కనిష్ఠ ధర రూ.16, సరాసరి ధర రూ.24 ప్రకారం మార్కెట్‌లో అమ్మకాలు జరిగాయి.
★ అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం చీనీ కాయలు టన్ను గరిష్ఠ ధర రూ.18 వేలు, కనిష్ఠ ధర రూ.10వేలు, సరాసరి రూ.15 వేలు పలుకాయి.
Similar News
News December 30, 2024
బంగారు దొంగలించిన ముగ్గురు ముద్దాయిల అరెస్టు
గోరంట్ల: ఇటీవల జరిగిన దొంగతనం పాల్పడిన దొంగలను ఎట్టికేలకు పట్టుకొని వారి వద్ద నుంచి 12 తులాల బంగారు నగలు, బైక్‌ను స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్టు చేశామని సీఐ బోయ శేఖర్ తెలిపారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వివరించారు. వీరు కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలతో పాటు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ పలు దోపిడీలకు పాల్పడినట్లు తేలిందని వెల్లడించారు.
News December 29, 2024
కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు 6,479 మంది: ఎస్పీ
ఈనెల 30 నుంచి జనవరి 17వ తేదీ వరకు నిర్వహించే పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్‌కు 6,479 మంది హాజరవుతున్నారని అనంతపురం ఎస్పీ జగదీశ్ తెలిపారు. నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో ఈరోజు చేపట్టిన ట్రైల్ రన్ సక్సెస్ అయ్యిందన్నారు. వీరిలో 5,242 మంది పురుష అభ్యర్థులు, 1,237 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, మొత్తం కలిపి 6,479 మంది వస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
News December 29, 2024
నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నా: మంత్రి సత్యకుమార్
మాతృ భాషలో చదువుకుంటేనే పిల్లలకు తెలివితేటలు వస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. తాను మరాఠీ అయినా తన పిల్లల్ని మాత్రం తెలుగులోనే చదివిస్తున్నానన్నారు. సంస్కృతి, వారసత్వం అన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయని, ప్రస్తుతం చాలామందికి తెలుగు రాయడం, చదవడం రావట్లేదన్నారు. మన తెలుగు ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.