News May 21, 2024
అనంతలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు 22,510మంది విద్యార్థులు దరఖాస్తు
అనంతపురం జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 22,510 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 15,921మంది, ఒకేషనల్ విద్యార్థులు 980మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,017మంది, ఒకేషనల్ విద్యార్థులు 592 మంది ఉన్నారు. 34 కేంద్రాలకు గాను అనంతపురం నగరంలోనే 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆర్‌ఓ వెంకటరమణ తెలిపారు.
Similar News
News December 26, 2024
నల్లచెరువు: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
నల్లచెరువు మండలం పరిధిలోని కే పూలకుంట గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హరి(33) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2024
బత్తలపల్లి: రైలు నుంచి కిందపడి యువతికి గాయాలు
బత్తలపల్లి మండలం డి చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కర్నూల్(D)కరివేములకు చెందిన హరిత రైలు నుంచి కిందపడి గాయపడింది. రైలులో బాత్‌రూమ్ వెళ్లి తిరిగి సీటు వద్దకు రాకపోవడంతో తమ్ముడు ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె మొబైల్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్‌మెన్‌ను అప్రమత్తం చేయడంతో డి చెర్లోపల్లి వద్ద గుర్తించారు. ఆమెను బత్తలపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
News December 26, 2024
గాండ్లపెంట: విద్యుదాఘాతంతో రైతు మృతి
గాండ్లపెంట మండలం గొడ్డువెలగల గ్రామపంచాయతీలోని నీరుకుంట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శంకర(52) అనే రైతు వ్యవసాయ పొలంలో బోరు వద్ద మోటార్ ఫ్యూజులు వేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే చెందాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.