News June 20, 2024

అనంతలో పెద్దిరెడ్డి మైనింగ్ మాఫియా: కాంట్రాక్టర్లు

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో మైనింగ్‌ మాఫియా నడిపారని వైసీపీ కాంట్రాక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, కూడేరు రవి ఆరోపించారు. తాము అన్ని రకాల అనుమతులు తీసుకున్నా.. అక్రమ కేసులు పెట్టి తమ క్వారీలను లాక్కున్నారని మండిపడ్డారు. అమిగోస్ మినరల్స్ ద్వారా రూ.1000 కోట్ల ఖనిజం దోచేశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన తమను పెద్దిరెడ్డి అనుచరులమంటూ అమిగోస్ ప్రతినిధులు బెదిరించారన్నారు.

Similar News

News January 15, 2025

ఏర్పేడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

ఏర్పేడు మండలం మేర్లపాక హైవే సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం ఏర్పేడు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిది నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌన్‌పేటగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2025

చంద్రగిరి: భయంతో బాలుడు ఆత్మహత్య

image

చంద్రగిరి పట్టణంలోని బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు తన స్నేహితుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో సమీర్ స్నేహితుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సమీర్‌పై అతని మామ కోపంతో గదిలో పెట్టి తలుపు వేశాడు. తిరిగి వచ్చి కొడుతాడన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News January 14, 2025

చంద్రగిరి: మంచి మనసు చాటుకున్న సీఎం

image

నారావారిపల్లెలో CM చంద్రబాబు వృద్ధ దంపతులను చూసి చలించిపోయి వారికి పెన్షన్ అందించేందుకు భరోసా ఇస్తూ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. CM వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడి నుంచి వచ్చారు.. సమస్య ఏంటని అడిగారు. తన పేరు నాగరాజమ్మ (62), భర్త సుబ్బరామయ్య అని తెలిపారు. పక్షవాతంతో సుమారు 5 సం. నుంచి బాధపడుతున్నానని తెలిపారు. వెంటనే దివ్యాంగ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.