News February 2, 2025
అనంతలో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య
అనంతపురంలోని పాపంపేట కాలనీలో బాబుల్లా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News February 2, 2025
అనంత: 86 లఘు చిత్రాలు 18 విభాగాలలో పోటీ
అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా 86 లఘు చిత్రాలు 18 విభాగాలలో పోటీ పడుతున్నాయని డైరెక్టర్ రషీద్ బాషా తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న లఘు చిత్రాలను జ్యూరీ సభ్యులు చూసి అవార్డులకు ఎంపిక చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఫిల్మ్ సొసైటీ సభ్యులు తోట బాలన్న, యాంకర్ రమేశ్, గోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
News February 2, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం: అనంత వెంకటరామిరెడ్డి
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసినా కూటమి నాయకులు మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు.
News February 2, 2025
హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే ప్రాణాలు సురక్షితం: ఎస్పీ జగదీశ్
హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు సురక్షితమని.. ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతుండటం మనం చూస్తున్నామన్నారు. ఈ విచార ప్రమాద ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.