News March 18, 2025
అనకాపల్లి: 23న ప్లాంట్ పరీక్ష నిర్వహణ

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న జరిగే ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (ప్లాంట్) ను నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ప్లాంట్ పరీక్ష నిర్వహణపై సోమవారం అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంలో 1,190 మందిని అక్షరాస్యులుగా మార్చినట్లు తెలిపారు. వారికి 23న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో ప్లాంట్ పరీక్ష నిర్వహించాలన్నారు.
Similar News
News March 18, 2025
RTC ఎండీ సజ్జనార్ క్రేజ్ ఇప్పుడు ఇంటన్నేషనల్

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Say no to betting apps #Tag తర్వాత దేశ, విదేశాల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. మీరు చెప్పేది నిజమే సర్ అంటూ లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. సజ్జనార్ ఇన్‌స్టాను 65 లక్షల మంది చూడగా X హ్యాండిల్‌ను 72 లక్షల మంది చూశారు. విదేశాల్లో మొరాకో, యూఎస్, యూఏఈ, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్ దేశాల వాసుల నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది.
News March 18, 2025
ఏడుగురు MLCల పదవీకాలం ముగింపు

AP: శాసనమండలిలో ఏడుగురు సభ్యుల ఆరేళ్ల పదవీకాలం ముగిసింది. యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రఘువర్మ పదవీ కాలం ముగియడంతో మండలి వారికి ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకముందు వీరు సీఎంతో జరిగిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అనంతరం మండలిని ఛైర్మన్ మోషేన్ రాజు రేపటికి వాయిదా వేశారు.
News March 18, 2025
మహబూబ్‌నగర్: ‘పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ’

MBNR జిల్లా గండీడ్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి బీమా క్లైమ్ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. నకిలీ స్టాంపులతో బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించాడని చెప్పారు. బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేయగా అసలు విషయం బయట పడిందన్నారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా.. అది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పారు.