News March 31, 2025
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు పనులకు శంకుస్థాపన

అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం సాయంత్రం అచ్యుతాపురం వద్ద శంకుస్థాపన చేశారు. రూ.243 కోట్లతో నాలుగు లైన్ల రహదారితో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 13.8 కిలోమీటర్ల పొడవునా నాలుగులైన్ల రహదారిగా విస్తరించనున్నారు. అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.
Similar News
News April 3, 2025
KMR: రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు పొడిగింపు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకం ప్రయోజనాలు ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో దరఖాస్తు గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
News April 3, 2025
సత్యసాయి జిల్లాకు వర్ష సూచన

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, శుక్రవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.
News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.