News April 22, 2025

అనకాపల్లి: ‘ఆధునిక సాంకేతికతను వినియోగించాలి’

image

నేరాలు నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. రేంజ్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ సమీక్షలో అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా పాల్గొన్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ప్రజలు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News April 23, 2025

ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

image

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.

News April 23, 2025

శ్రీరాంపూర్: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు

image

సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. అర్హత కలిగిన ఉద్యోగుల ఉన్నత చదువుకు ఇప్పటి వరకు యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహక నగదు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వివిధ పోటీ పరీక్షల్లో 2 వేలలోపు ర్యాంకు సాధించిన 57 మందికి అందిస్తున్న రూ.10 వేలు మెరిట్ స్కాలర్ షిప్‌ను రూ.16 వేలకు పెంచింది. అలాగే ర్యాంక్ పరిమితి 2 వేలు లోపు నుంచి 8 వేలకు అవకాశం కల్పించారు.

News April 23, 2025

పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

image

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరిం‌త పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని‌ జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం‌ నియామక‌పత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని‌ సూచించారు.

error: Content is protected !!