News February 25, 2025
అనకాపల్లి: ‘ఈనెల 27న వారికి సెలవు’

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈనెల 27వ తేదీన ప్రత్యేక క్యాజువల్ లీవు మంజూరు చేస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 26, 27 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 26, 2025
ఆత్మహత్యల ‘కోటా’.. అడ్డుకట్టకు చర్యలు!

రాజస్థాన్‌లోని కోటాలో ఎన్ని చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆత్మహత్యలకు <<14028051>>అడ్డుకట్ట<<>> పడటంలేదు. స్థానిక అధికారులు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో హాస్టల్ యజమానులు ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి వసూలు చేసేవారు. ఇకపై తొలుత రూ.2వేలు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పార్క్‌లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.
News February 26, 2025
భూపాలపల్లి: శివరాత్రి ఉత్సవాలకు భారీగా పోలీసులు

మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంలో పోలీసులతో సమావేశమై మాట్లాడుతూ ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 208 మంది కానిస్టేబుల్స్ ఉన్నట్లు తెలిపారు. మూడు చోట్లలో భక్తులకు ప్రత్యేక సేవలు అందించనున్నట్లు తెలిపారు.
News February 26, 2025
మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థులు 14,224 మంది

మెదక్ జిల్లాలో 14,224 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.