News March 6, 2025

అనకాపల్లి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మీ కామెంట్

image

అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ.. నక్కపల్లిలో ఏర్పాటు అయ్యే మిట్టల్ స్టీల్ ప్లాంట్లో లక్ష ఉద్యోగ అవకాశాలు ఉండగా కనీసం 20వేల ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్నారు. మరి కొణతాల వ్యాఖ్యలపై మీ కామెంట్.

Similar News

News December 16, 2025

సర్పంచ్‌, వార్డు సభ్యులకు 20న ప్రమాణ స్వీకారం: జనగామ కలెక్టర్‌

image

జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఈ నెల 20వ తేదీన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 16, 2025

ఇంటర్నెట్ కింగ్ ‘Chrome’.. మార్కెట్‌లో 70% వాటా!

image

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ క్రోమ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతోంది. ‘STAT COUNTER’ విడుదల చేసిన NOV-2025 డేటా ప్రకారం.. 70% కంటే ఎక్కువ మంది యూజర్లు క్రోమ్‌నే వాడుతున్నారు. దీని తర్వాత సఫారీ(14.35%), EDGE(4.98%), ఫైర్‌ఫాక్స్(2.3%), ఒపెరా(1.89%), శామ్‌సంగ్ ఇంటర్నెట్(1.86%), మిగిలినవి(3.4%) ఉన్నాయి. మీరు ఏ బ్రౌజర్ ఎక్కువగా వాడతారు? COMMENT

News December 16, 2025

చిత్తూరు: నూతన పోలీసుకు SP సూచనలు.!

image

చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీసు కానిస్టేబుల్లు వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని SP తుషార్ డూడీ తెలిపారు. ఎంపికైన వారు 20వ తేదీ ఉ.9 గం.లకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు రావాలన్నారు. వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్, 6 ఫొటోలు, రూ.100 బాండ్‌తో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ 9 నెలలు ఉండనుంది.