News October 7, 2024

అనకాపల్లి: కలెక్టరేట్ పరిష్కార వేదికకు 232 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సంస్థలపై 232 అర్జీలను ప్రజలు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News December 30, 2024

విశాఖ: పలు రైళ్లకు జనవరి 1 నుంచి నంబర్ల మార్పు

image

తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 7 రైళ్ల నంబర్లలో మార్పులు చేశారు. కటక్-గుణుపూర్ ప్యాసింజర్‌కు(68433/34),విశాఖ-కిరండూల్ ప్యాసింజర్‌కు (58501/02),విశాఖ-రాయ్‌పూర్ ప్యాసింజర్‌కు (58528/27), విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్‌కు (58538/37), విశాఖ- బ్రహ్మపూర్ (58532/31), విశాఖ-గుణుపూర్ (58506/05), విశాఖ-భవానీపట్నం (58504/03) నంబర్లను కేటాయించారు. జనవరి 1నుంచి అమలులోకి రానున్నాయి.

News December 30, 2024

విశాఖ: తొలి రోజు 233 మంది హాజరు

image

పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి విశాఖ అభ్యర్థులకు సోమవారం నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కైలాసగిరి పోలీస్ మైదానంలో ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు 600 మంది హాజరు కావాల్సి ఉండగా 233 మంది మాత్రమే బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐజీ గోపీనాథ్ రెడ్డి, ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు.

News December 30, 2024

పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ విభాగంలో 29 క్యాటగిరీలలో మొత్తం 244 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 31నుంచి జనవరి 10లోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. >Share it