News March 6, 2025
అనకాపల్లి: చీమల మందు తాగిన అంగన్వాడీ కార్యకర్త

కె.కోటపాడు మండలం పోతనవలస అంగన్వాడీ కార్యకర్త రొంగలి నూకరత్నం గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సీఐటీయూ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం ఆమె కె.కోటపాడు సి.హెచ్.సిలో చికిత్స పొందుతుంది. తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడంతోనే నూకరత్నం చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, సీఐటీయూ నాయకులు తెలిపారు.
Similar News
News March 6, 2025
సుప్రీం కోర్టుకు చేరిన TN హిందీ పంచాయితీ

TN, కేరళ, బెంగాల్‌లో జాతీయ విద్యా విధానం (NEP) అమలుకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. రాజ్యాంగం ప్రకారం అవి NEP అమలు చేయాలని, ఇందుకు MOU కుదుర్చుకున్నాయని పిటిషన్ వేసిన అడ్వకేట్ మణి అన్నారు. దీనిపై TN CM స్టాలిన్ వ్యతిరేకత అవాస్తవం, రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. పాలసీ అమలుపై రాష్ట్రాలను ఆదేశించే హక్కు సుప్రీంకోర్టుకు లేనప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కలగజేసుకోవచ్చన్నారు.
News March 6, 2025
సిద్దిపేట్: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని సిద్దిపేట జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్‌లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్‌లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.
News March 6, 2025
‘ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి’

బాపట్ల జిల్లా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగినట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొత్తపల్లి రమేష్ తెలిపారు. ఈ మేరకు నూతనంగా ఎంపికైన జిల్లా కార్యవర్గ సభ్యులతో కలెక్టర్ వెంకట మురళిని గురువారం బాపట్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. రమేశ్ మాట్లాడుతూ.. మీడియా రంగంలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.