News February 24, 2025
అనకాపల్లి జాతరపై పవన్‌కు వినతి

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన సోమవారం వినతిపత్రం అందజేశారు. కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబికా అమ్మవారి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై విశాఖ కలెక్టర్ కసరత్తు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం పూర్తయ్యింది. విశాఖ జిల్లాలోని 13 పోలింగ్ కేంద్రాలకు గాను పీవో, ఏపీవో, ఓపీవోలను కేటాయిస్తూ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్లోని ఎన్.ఐ.సి. కేంద్రం నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా 13 పీవోలను, 13 ఏపీవోలను, 26 మంది ఓపీవోలను కేటాయించారు.
News February 24, 2025
అనకాపల్లి జిల్లాలో రెండు రోజులు వైన్స్ బంద్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన అనకాపల్లిలో మాట్లాడుతూ.. వచ్చేనెల మూడవ తేదీన(మార్చి 3) ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తామన్నారు.
News February 24, 2025
రూ.18 లక్షల నగదు పట్టివేత: నిర్మల్ ఏఎస్పీ

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.18 లక్షల నగదును పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా వెల్లడించారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరైనా ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.18 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేశామన్నారు. అనంతరం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.