News April 24, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ 590 ప్లస్ మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులకు కలెక్టర్ అభినందన➤ మాడుగుల మోదకొండమ్మను దర్శించుకున్న జాయింట్ కలెక్టర్➤ ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ➤ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలి:DRO➤ విశాల్ మార్ట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని CITU ధర్నా➤ వడ్డాదిలో అగ్నిప్రమాదం➤ పది ఫలితాల్లో ప్రథమ స్థానంలో కోటవురట్ల మండలం➤ ఉగ్రదాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీలు
Similar News
News April 25, 2025
శ్రీహరికోట: కీలక ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో

పాకిస్తాన్‌పై నిఘా పెట్టేందుకు స్పై శాటిలైట్‌ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సిద్ధమవుతోంది. ఈ ఉపగ్రహం ద్వారా 24 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా భారత్-పాక్ సరిహద్దుపై భద్రతా ఏజన్సీలు నిఘా ఉంచనున్నాయి. అత్యాధునిక EOS-09 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే PSLV-C61 మిషన్‌ను ఇస్రో ప్రయోగిస్తుందని కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.
News April 25, 2025
తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి వాసి

తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి మండలం, పోచవరానికి చెందిన కాకర్ల వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా చేస్తానని ఆయన అన్నారు.
News April 25, 2025
విశాఖలో నేడు చంద్రమౌళి అంత్యక్రియలు

కశ్మీర్ ఉగ్రవాద దుర్ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు విశాఖలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి మృతదేహానికి గురువారం రాత్రి ఘన నివాళులర్పించారు.