News April 19, 2025

అనకాపల్లి: జిల్లాలో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

image

అనకాపల్లి జిల్లాలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భగ్గుమంటూ ఎండలు కాస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. శనివారం జిల్లాలో కొన్ని మండలాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని MD రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Similar News

News April 20, 2025

కొమురవెల్లి మల్లికార్జునుడిని దర్శించుకున్న బక్కి వెంకటయ్య

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

News April 20, 2025

ఆ సినిమాల్లో యాక్టింగ్ చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది: సామ్

image

తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు పెద్ద పీట వేస్తారని హీరోయిన్ సమంత అన్నారు. తాను నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమాలో అంతా కొత్తవారే నటించారని చెప్పారు. నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదన్నారు. తాను నటించిన మొదటి రెండు చిత్రాల్లో యాక్టింగ్ చూస్తే ఇప్పటికీ సిగ్గుగా అనిపిస్తుందని సామ్ తెలిపారు. కాగా ‘ఏమాయ చేసావె’తో ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

News April 20, 2025

కుంభమేళాను రాజకీయంగా వాడుకున్నారు: అఖిలేశ్ యాదవ్

image

యూపీలో జరిగిన మహాకుంభమేళాను సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ కుంభ్‌గా మార్చారని SPచీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బీజేపీ తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా యోగిని ప్రకటించడానికి కుంభమేళాను రాజకీయంగా వాడుకునే ప్లాన్ చేశారన్నారు. ఆ సమయంలో యోగిని PM అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని వెనక బీజేపీ పాత్ర ఉంటుందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

error: Content is protected !!