News March 17, 2025
అనకాపల్లి జిల్లాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్పీ

అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా లారీ యజమానులు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులు కు సూచించారు.
Similar News
News March 18, 2025
సంగారెడ్డి: వరకట్నం వేధింపులకు వివాహిత బలి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాయికోడ్ మండలం నాగన్పల్లికి చెందిన మహేశ్వరి(22)కి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో పెళ్లైంది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించడంతో మనస్తాపం చెందిన మహేశ్వరి సోమవారం ఉదయం ఉరేసుకుంది.
News March 18, 2025
అన్నమయ్య: ఇద్దరు యువకులు దుర్మరణం

అన్నమయ్య జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పీటీఎంకు చెందిన శ్రీనివాసులు(22), చందు(22) బి.కొత్తకోటలో సినిమా చూడాలని సోమవారం రాత్రి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళుతూ, బూర్లపల్లె వద్ద గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడే మృతి చెందగా, చందును ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడన్నారు.
News March 18, 2025
రాష్ట్రంలో మన్యం జిల్లాలోనే అధికం

ఉదయాన్నే మంచు ప్రభావంతో ప్రజలు వణుకుతుంటే .. మధ్యాహ్నం మాత్రం భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అయితే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం .. మన్యం జిల్లాలోని వీరఘట్టంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 42.8 డిగ్రీలీ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.