News April 23, 2025

అనకాపల్లి జిల్లాలో రూ.59 కోట్ల బకాయి 

image

అనకాపల్లి జిల్లాలో ఉపాధి కూలీలకు నాలుగు రోజుల్లో రోజుల్లో వేతన బకాయిలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు డ్వామా అధికారులు మంగళవారం తెలిపారు. గత 12 వారాల నుంచి కూలీలకు వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఈ నేపథ్యంలో కేంద్రం రూ.961 కోట్లను వేతన బకాయిల చెల్లింపుకు విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాలో కూలీలకు సుమారు రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Similar News

News April 23, 2025

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

TG: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం ప‌రీక్షలు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సెకండియర్ ఎగ్జామ్స్ మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జరగనున్నాయి. పూర్తి టైమ్ టేబుల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 23, 2025

HYD – WGL హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

image

హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట స్టేజీ వద్ద కారు ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆలేరుకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 23, 2025

రాజన్న హుండీ లెక్కింపు ప్రారంభం

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయ ఓపెన్ స్లాబ్‌లో బుధవారం హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు. పటిష్ఠ పోలీసు భద్రత నడుమ హుండీ ఆదాయం లెక్కింపు చేస్తున్నట్లు ఈవో వినోద్ పేర్కొన్నారు. ప్రతి నెల 15 నుంచి 20 వరకు హుండీ ఆదాయం లెక్కిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

error: Content is protected !!