News February 7, 2025
అనకాపల్లి: టీచర్‌పై పోక్సో కేసు నమోదు
బుచ్చయ్యపేట వడ్డాది ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం తెలిపారు. అనంతరం నిందితుడిని చోడవరం కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజులు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 8, 2025
‘స్కిల్ ఇండియా’కు రూ.8,800 కోట్లు
దేశంలోని యువతకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రారంభించిన ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని 2026 వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రూ.8,800 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం కౌశల్ వికాస్ యోజన 4.O, జన్ శిక్షణ్ సంస్థాన్, PM-NAPS పథకాలను భాగం చేసింది. అలాగే జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది.
News February 8, 2025
జైనూర్: విద్యార్థులతో అడిషనల్ కలెక్టర్ భోజనం
మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో గల ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, తాగునీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం దృశ్య డైట్ ఛార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
News February 8, 2025
నల్గొండ: కలెక్టరేట్లో పందులు..
జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయ్. నిత్యం వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఇవి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కలెక్టరేట్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా ప్రదేశాల్లో పందుల బెడద ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.