News February 15, 2025
అనకాపల్లి: నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి పట్టణానికి చెందిన ఎస్.పైడిశెట్టి దస్తావేజుల కోసం ఒత్తిడి చేయడంతో డి.వెంకట సత్యనారాయణ ఈనెల 11వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 13, 2025
ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నం.1గా ట్రెండ్ అవుతోందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. బ్లాక్‌బస్టర్ సునామీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిందని పేర్కొంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.115 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
News March 13, 2025
త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.
News March 13, 2025
భవన నిర్మాణానికి 24 గంటల్లో అనుమతులు

భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని పట్టణ ప్రణాళిక శాఖ అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. బుధవారం కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.