News February 25, 2025

అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా పంచకర్ల

image

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 14న పిఠాపురంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబును సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పీఓసీలు పార్టీ మండల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి. 

Similar News

News February 25, 2025

ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు ఎందరంటే?

image

ఈ నెల 27న ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం.వరకు జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఉమ్మడి ఉభయ గోదావరిలో 3,14,984 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 456 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటర్లు ఉన్నారని, 66 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. మంగళవారం సాయంత్రం 4.గంటల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు.

News February 25, 2025

నేటితో ముగియనున్న MLC ఎన్నికల ప్రచారం

image

TG: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ముగియనుంది. అసెంబ్లీ ఎలక్షన్స్‌ను తలపించేలా నెల రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న పోలింగ్ జరగనుంది.

News February 25, 2025

వెలుగోడు: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యాయత్నం

image

వెలుగోడులోని గాంధీ నగర్‌కు చెందిన వజీద్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తొమ్మిది నెలలుగా అతని భార్య పుట్టింట్లో ఉంటోంది. ఈ విషయంపై ఆయన పలుసార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!