News March 1, 2025

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం చరిత్ర ఇదే..!

image

అనకాపల్లి పట్టణం గవరపాలెం కొబ్బరి తోట ప్రాంతంలో 1450లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. 1611లో అనకాపల్లి ప్రాంతానికి రాజుగా నియమించబడిన అప్పలరాజు పాయకరావు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1937లో దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్‌లో దేవాలయానికి ఈఓగా వ్యవహరిస్తారు. ప్రతి ఏటా ఉగాది ముందు రోజు నుంచి నెలరోజుల పాటు జాతర జరుగుతుంది. 

Similar News

News March 1, 2025

డిప్యూటీ సీఎంగా విజయ్? ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ

image

టీవీకే అధినేత విజయ్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ కీలక చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో AIDMKతో పొత్తు ఉంటే బాగుంటుందని తెలిపారు. సీఎంగా పళనిస్వామి, డిప్యూటీగా విజయ్ ఉండాలన్నారు. ఈ ఫార్ములాతోనే APలో ఎన్డీయే కూటమి విజయం సాధించిందన్నారు. ఏఐడీఎంకేకు 25శాతం ఓటుబ్యాంకు ఉందని, టీవీకేకు 20 శాతం రావచ్చని అంచనా వేశారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమన్నారు.

News March 1, 2025

ఫస్ట్ షోరూమ్‌ను టెస్లా ఎక్కడ ఓపెన్ చేస్తోందంటే..

image

భారత్‌కు టెస్లా మరింత చేరువైంది. ముంబై బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో షోరూమ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఓ కమర్షియల్ కాంప్లెక్సులోని అండర్‌గ్రౌండులో 4000 sft స్పేస్‌ను ఐదేళ్లు లీజుకు తీసుకుంది. ఒక sftకి రూ.900 చొప్పున నెలకు ₹35లక్షల రెంటు చెల్లించనుంది. రెండో షోరూమ్‌ను ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్‌లో ఆరంభిస్తుందని సమాచారం. టెస్లా ఇప్పటికే ఉద్యోగుల హైరింగ్ ప్రాసెస్ చేపట్టడం గమనార్హం.

News March 1, 2025

మామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

image

వరంగల్ మామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో వివాదం తెలత్తినట్లు సమాచారం. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించగా.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!