News March 29, 2025
అనకాపల్లి: పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టం రద్దు: ఎస్పీ

రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న శెలవు ప్రకటించినందున జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టంను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరం, రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 3, 2025
TARIFFS: నిర్మానుష్య దీవులనూ ట్రంప్ వదల్లేదు

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ వివిధ దేశాలపై దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే జనావాసాలు లేని ప్రాంతాలను సైతం వదలకపోవడం చర్చనీయాంశమైంది. అంటార్కిటికా సమీపంలోని నిర్మానుష్య అగ్నిపర్వత ఐలాండ్స్‌కూ 10% టారిఫ్స్ విధించారు. ఆ దీవులు కేవలం పెంగ్విన్లు, హిమానీనదాలకు నెలవు. దశాబ్దకాలంగా మనుషులు వెళ్లని ఆస్ట్రేలియా సమీపంలోని హెర్డ్, మెక్‌డొనాల్డ్ ఐలాండ్స్‌నూ వదల్లేదు.
News April 3, 2025
తిరుమలలో: ఆ భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

తిరుమల శ్రీవారికి రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో మినహా మిగిలిన రోజుల్లో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. దాతతో పాటు నలుగురికి సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల సుపథం ప్రవేశ దర్శనం ఉంటుంది. వసతి, ప్రసాదం పొందవచ్చు.
News April 3, 2025
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

వేసవికాలంలో బాపట్ల జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో ప్రజల అనారోగ్యానికి గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. జేసీ ప్రకార్ జైన్ పాల్గొన్నారు.