News March 8, 2025
అనకాపల్లి: పేదరికం లేని సమాజమే లక్ష్యం: కలెక్టర్

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా శనివారం నుంచి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీ4 సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీ వరకు సర్వే జరుగుతుందని తెలిపారు. ఇంటింటా సర్వే ద్వారా పేదల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
Similar News
News December 20, 2025
భారత్‌పై డికాక్ రికార్డు

టీమ్ ఇండియాపై T20Iల్లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ నిలిచారు. ఇవాళ్టి మ్యాచులో ఫిఫ్టీతో కలుపుకొని భారత్‌పై 14 ఇన్నింగ్సుల్లోనే ఆరు అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వెస్టిండీస్ ప్లేయర్ పూరన్(20 ఇన్నింగ్స్‌ల్లో 5), ఇంగ్లండ్ ప్లేయర్ బట్లర్ (24 ఇన్నింగ్స్‌ల్లో 5) ఉన్నారు.
News December 20, 2025
RJY: ఆర్ట్స్ కాలేజీలో కామర్స్ బ్లాక్‌ను ప్రారంభించిన లోకేశ్

రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థి, తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు రూ.42లక్షల విరాళంతో నిర్మించిన ‘స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్’ బ్లాక్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం తిరుమలరావు దాతృత్వాన్ని లోకేష్ కొనియాడారు. చదివిన విద్యాసంస్థలకు తిరిగి సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి, అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
News December 20, 2025
విద్యార్థులందరికీ దంత పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులెవరూ దంత సమస్యలతో బాధపడకూడదని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో విద్యార్థుల చికిత్స తీరును ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించి, 1500 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23లోగా తొలి విడత పూర్తి చేసి, జనవరి 1 నుండి రెండో విడత శిబిరాలు ప్రారంభించాలని వైద్యులకు సూచించారు.


