News April 7, 2025

అనకాపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 42 ఫిర్యాదులు

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 42 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఆస్తి తగదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఎస్పీ తుహీన్ సిన్హా స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.

Similar News

News April 8, 2025

ముస్తాబాద్: 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడెం, నామాపూర్, పోతుగల్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో మొత్తం జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

News April 8, 2025

ఆత్మకూరు ప్రైవేట్ ఆసుపత్రిలో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌ఓ

image

ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళకు డెలివరీ చేసి పసికందును కోసి బయటకు తీశారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఆపరేషన్ చేసిన డాక్టర్లను ఆయన విచారించారు. ఈ ఘటనలో డాక్టర్ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అన్నారు.

News April 8, 2025

ఒక్క మ్యాచ్‌కే రిటైర్మెంట్

image

ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ విల్ పుకోవిస్కీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికారు. ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విల్ అనూహ్యంగా రిటైర్ కావడం చర్చనీయాంశంగా మారింది. 2021లో భారత్‌పైనే విల్ టెస్టు అరంగేట్రం చేశారు. కానీ గతేడాది ఓ మ్యాచ్‌లో అతడి తలకు బంతి బలంగా తాకడంతో కుప్పకూలాడు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా అతడు క్రికెట్ ఆడే పరిస్థితులు లేవని మెడికల్ ప్యానెల్ నిర్ధారించింది.

error: Content is protected !!