News November 22, 2024

అనకాపల్లి: ‘ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి’

image

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ డిసెంబర్ చివరినాటికి లక్ష గృహాలను పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆదేశించారు. విజయవాడ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News November 22, 2024

విశాఖ, అరకులో యాంకర్ హబ్‌లు: మంత్రి దుర్గేశ్

image

విశాఖ, అరకులో యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. తొట్లకొండతో పాటు పలు బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ నుంచి క్రూయిజ్ సేవలు విస్తరిస్తామన్నారు. బీచ్ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బీచ్‌ల అభివృద్ధితో పాటు ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బొర్రా గుహలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

News November 22, 2024

మంచు తెరల్లో పొద్దుతిరుగుడు అందాలు

image

ఇదేదో గ్రాఫిక్స్ ఫొటో..లేదా వాల్ పేపర్ ఫొటో అనుకుంటే మీ పొరపాటే.! డుంబ్రిగూడ మండలంలోని జంగిడివలస రైల్వే గేటు సమీపంలో స్థానిక గిరిజనులు వేసిన పొద్దుతిరుగుడు పువ్వుల పంట ఇది. ఒకపక్క ఆహ్లాదకరమైన మంచు తెరలు.. మరోపక్క ఆకర్షించే ఈ పొద్దుతిరుగుడు పువ్వుల అందాలు ప్రకృతి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మైదాన ప్రాంతానికి చెందిన పర్యాటకులు ఈ అద్భుతమైన దృశ్యాలను చూసి ఫిదా అవుతున్నారు.

News November 22, 2024

Pic Of The Day: విశాఖ ప్లేయర్‌కి క్యాప్ ఇచ్చిన కోహ్లీ

image

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విశాఖ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్‌కు ముందు నితీశ్ కుమార్‌కు విరాట్ కోహ్లీ ఇండియా క్యాప్‌ అందించారు. గతేడాది IPLలో అదరగొట్టడంతో నితీశ్.. ఈ అక్టోబర్‌లో బంగ్లా‌తో జరిగిన T-20లో అరంగేట్రం చేశారు. అతన్ని వచ్చే సీజన్‌కు SRH రూ.6 కోట్లతో రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2024 నితీశ్‌కు గుర్తుండిపోతుందనే చెప్పొచ్చు.