News February 23, 2025
అనకాపల్లి: ‘ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ’

అనకాపల్లి జిల్లాలో ఐదు మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి స్థాయిలో ప్రవేశ ఉంటుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు www.crse.ap.gov.in ను చూడాలన్నారు.
Similar News
News February 23, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన CM పర్యటన

నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహం జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా నెల్లూరులో జిల్లా ఎస్పీ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం పర్యటనను విజయవంతం చేశారు. దీంతో అందరికీ జిల్లా ఎస్పీ దన్యవాదాలు తెలియజేశారు.
News February 23, 2025
నర్సీపట్నం: బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల ఏర్పాటుపై ఆదివారం శాసనసభ ప్రాంగణంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
News February 23, 2025
WNP: ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఇసుక అవసరం ఉన్న వారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలని దళారులను ఎవరూ ఆశ్రయించొద్దని సూచించారు. ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 08545-233525కు కాల్ చేసి తెలపాలని అన్నారు.