News November 19, 2024

అనకాపల్లి: ‘మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపాలి’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను జిల్లా స్థాయికి తీసుకురావద్దన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 24, 2024

క్రీడాభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో క్రీడల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా సంఘాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవోతో పాటు ఒలింపిక్ సంఘం పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

News November 23, 2024

విశాఖ: 25, 26 తేదీల్లో పలు రైళ్లు రద్దు

image

ఈనెల 25న విజయవాడ-విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-విశాఖ-కాకినాడ మెము ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి పాసింజర్ రైలు రద్దు చేశామన్నారు. 26న విశాఖ గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News November 23, 2024

పచ్చ మంద దుష్ప్రచారం: గుడివాడ అమర్నాథ్

image

చంద్రబాబు ఏం చేసినా ఒప్పు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చ మంద దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.6.99 లకు కొంటే తప్పులేదు కానీ జగన్ కేవలం యూనిట్ రూ.2.49లకు కొంటే మాత్రం తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తుందని శనివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.